* కర్నూలు - ఉల్చాల MPTC 1 సిపిఎం అభ్యర్థి ధర్మవరం రాఘవేంద్ర నీ కాలర్ పట్టి బయటికి లాక్కొచ్చి కార్లో వేసిన ఎస్సై రామాంజనేయులు పై చర్యలు తీసుకోవాలి - సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్*
ఉల్చాల MPTC 1 సిపిఎం అభ్యర్థి డి.రాఘవేంద్ర నీ తాలూకా ఎస్సై రామాంజనేయులు ఊర్లో గొడవలు పెట్టడానికి పోటీ చేసావా అంటూ పోలింగ్ బూతుల దగ్గర నుండి కాలర్ పట్టుకొని లాక్కొచ్చి బయటికి వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనన్నారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా పక్షపాతంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం ఏజెంటు లాగా పని చేసిన ఎస్సై రామాంజనేయులుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ZPTC, MPTC ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం
* పల్నాడు జిల్లా మాదల గ్రామంలో 13,15 పోలింగ్ బూత్ ల్లో TDP - JSP ఏజెంట్స్ బ్యాలెట్ పేపర్లను గుంజుకొని కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసుకున్నారు.
* అడ్డుకున్న CPM ZPTC అభ్యర్థి పై దాడి చేసి అభ్యర్థి ఐడి కార్డును చించివేశారు.
* కూటమి ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న పోలీసు, ఎన్నికల అధికారులు
పల్నాడు జిల్లాలో టిడిపి ఏక పక్ష రిగ్గింగ్... చేతులు ఎత్తేసిన అధికారులు...
అనపర్తి మండలంలో మధ్యాహ్నం 3 గంటలకు 57.80 శాతం ఓట్లు పోలయ్యాయి
పిఠాపురం మండలంలో మూడు గంటలకు 53.91% పోలింగ్ నమోదు అయింది. మొత్తం పోలైన ఓట్లు 34073.మహిళ ఓట్లు 16835,పురుష ఓట్లు 17238 ఓట్లు.
మార్కాపురం జిల్లా : ఓటు హక్కు వినియోగించుకుంటున్న సిపిఎం జడ్పిటిసి అభ్యర్థి దుగ్గెంపూడి తిరుపతిరెడ్డి పెద్దదోర్నాల మండల జడ్పిటిసి ఎన్నికల బరిలో ఉన్న సిపిఎం జడ్పిటిసి అభ్యర్థి దుగ్గెంపూడి తిరుపతిరెడ్డి తన స్వగ్రామo చిన్న గుడిపాడు గ్రామంలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 38 లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యం.
తిరుపతి - ఏర్పేడు మండలం పాతవీ రాపురం సెగ్మెంట్ పరిధిలో ఉదయం7గం. నుండి మధ్యాహ్నం 2గం వరకు పోలైన ఓట్లు
ఇసుక తాగేలి ( బూత్ నంబర్-55)
612/969--63.15 శాతం
పాత వీరాపురం ( బూత్ నెంబర్-56)
468/620--75.48 శాతం
పాత వీరాపురం( బూత్ నెంబర్-57)
497/629--79 శాతం
మాధవ మాల( బూత్ నెంబర్58)
511/1022--50 శాతం
మొత్తంగా ఇప్పటివరకు పోలైన ఓట్లు 2088/3240 --64.4 శాతం
తిరుపతి : తలారి వెట్టు పోలింగ్ స్టేషన్ 35 లో బారులు తిరిగిన మహిళలు, వృద్ధులు... చాలా లేటుగా పోలింగ్ జరుగుతున్నది ఇప్పటికీ 105 ఓట్లు మాత్రమే పోలైనవి.
సత్యవేడులో జోరుగా పోలింగ్: మధ్యాహ్నం 1 గంటకు 54.14 శాతం ఓటింగ్ నమోదు
నీర్పాకోట వైసీ కాలని లో బూత్ నం.26 లో ఇప్పటి వరకు 250 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి
పార్వతపురం మండలం ఒంటి గంట సమయానికి ఓవరాల్ గా 44 శాతం పోలింగ్ అయింది
జియ్యమ్మ వలస మండలంలో టోటల్ ఓట్లు పర్సంటేజ్.44%
నిడదవోలు మండలంలో మూడు గంటల వరకు పోలింగ్ 59.20% ఓట్లు పోలయ్యాయి
బిక్కవోలు మండలంలో మధ్యాహ్నం 3 గంటలకు 56.62% పోలింగ్
బిక్కవోలు : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు - 2026 లో భాగంగా బిక్కవోలు మండలంలో మధ్యాహ్నం 3:00 గంటల వరకు 56.62%పోలింగ్ నమోదైంది. మండలంలోని మొత్తం 79 పోలింగ్ కేంద్రాల్లోమధ్యాహ్నం 3 గంటల వరకు 32,787 మంది ఓటర్లు ఓటు వేశారు. వారిలో పురుషులు - 15,820మహిళలు - 16,967మంది ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు 44.92% గా ఉన్న పోలింగ్, 3 గంటలకు 56.62% కి పెరిగింది. మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఓటు వేయడం విశేషం. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
తాళ్లపూడి మండలంలో మధ్యాహ్నం మూడు గంటలకు 60.77 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చేబ్రోలు మండలంలో 98 ఏళ్ల వృద్ధురాలి ఓటు హక్కు వినియోగం
కొత్తపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- బ్యాలెట్ పత్రాలు మారాయంటూ అభ్యర్థుల ఆందోళన
-అధికారులను నిలదీసిన అభ్యర్థులు
ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : కొత్తపేట పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్ పత్రాల మార్పుపై అభ్యర్థుల ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొదటి పోలింగ్ బూత్‌కు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు రెండో పోలింగ్ బూత్‌లోకి ఎలా వచ్చాయంటూ అభ్యర్థులు ఎన్నికల అధికారులను నిలదీశారు. బ్యాలెట్ పత్రాలు మారడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు హుటాహుటిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అసలు బ్యాలెట్ పత్రాలు ఎలా మారాయి ? ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి ? ఈ పరిణామం పోలింగ్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపింది ? అన్న అంశాలపై అక్కడ చర్చ జరుగుతోంది. అధికారులు చేపట్టే విచారణపై అభ్యర్థులు, ఓటర్లలో ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు ఎన్నికల అధికారులు వచ్చాక తెలియాల్సి ఉంది.
ప్రజాశక్తి - నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 23 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 75 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 63,922 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం 450 మంది సిబ్బందిని నియమించగా, శాంతిభద్రతల పరిరక్షణకు 60 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలాన్ని మూడు జోన్లు, తొమ్మిది రూట్లుగా విభజించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

గోరంట్ల మండలంలో ఉద్రిక్తత
- పోలీసులతో వాగ్వాదం
శ్రీ సత్యసాయి జిల్లా: గోరంట్ల మండలం మలసముద్రం గ్రామ పంచాయతీలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్ కేంద్రాల ఓ పార్టీ వారు డబ్బులు పంచుతున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ బోయ శేఖర్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అభ్యంతరం తెలిపిన సీఐతో వైసీపీ నాయకురాలు, కార్యకర్తలు వాగ్వాదం చేశారు. సీఐ తమను దూషించారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. సీఐకి వ్యవతిరేకంగా వైసిపి ఇంచార్జ్ ఉషశ్రీ, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.

సిపిఎం అభ్యర్థిని కాలర్ పట్టి బయటికి లాక్కొచ్చిన ఎస్సై
ఎస్సై రామాంజనేయులుపై చర్యలు తీసుకోవాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్
కర్నూలు జిల్లా : కర్నూలు మండలం ఉల్చాల ఎంపిటిసి 1 సిపిఎం అభ్యర్థి డి.రాఘవేంద్రని తాలూకా ఎస్సై రామాంజనేయులు ఊర్లో గొడవలు పెట్టడానికి పోటీ చేసావా అంటూ పోలింగ్ బూత్ దగ్గర నుండి కాలర్ పట్టుకొని లాక్కొచ్చి బయటికి వేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా పక్షపాతంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం ఏజెంటు లాగా పని చేసిన ఎస్సై రామాంజనేయులుపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే తెలుగుదేశం పార్టీ ఏజెంటు లాగా సిపిఎం ఏజెంటుపై దాడి చేస్తుంటే, బయటికి లాక్కొస్తుంటే ''చూస్తూ ఉంటారేంటని ప్రశ్నించినందుకు ఎస్ఐ రామాంజనేయులు అభ్యర్థిని కాలర్ పట్టుకొని లాకెళ్లి కార్లో వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి ఉల్చల గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలాగా పోలీస్ బందోబస్తు పెంచి శాంతిభద్రతలను కాపాడాలని కోరారు.

వైసిపి ఏజెంట్లపై బీరు బాటిల్లతో టిడిపి నేతల దాడి
తిరుపతి జిల్లా : పెనగలూరు మండలం నల్లపురెడ్డి పల్లెలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో తీవ్ర ఘర్షణ.
వైఎస్ఆర్సిపి ఏజెంట్లను బూత్ లో నుంచి తరిమి కొట్టిన కూటమి నాయకులు.
వైఎస్ఆర్సిపి ఏజెంట్లపై తెలుగుదేశం నాయకులు బీరు బాటిల్లతో దాడి.
తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలింపు
పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని వైసిపి అభ్యర్థుల ఆరోపణ.
బీరు బాటిల్ లో పెట్రోల్ నింపి దాడులు - పలువురికి వైసీపీ కార్యకర్తలకు గాయాలు

పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్ లక్ష్మీశ ఆకస్మిక తనిఖీ
- నున్న, బొడ్డుపాడులలో ఎన్నికల సరళిని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్
ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా నున్న, బొడ్డుపాడు పరిధిలోని ఆర్‌సిఎమ్ స్కూల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న ఓటింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు కల్పించిన త్రాగునీరు, నీడ, క్యూ లైన్లు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ర్యాంప్ వంటి ప్రాథమిక వసతులను తనిఖీ చేశారు. ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ నిఘా వ్యవస్థ పనితీరును కలెక్టర్ సమీక్షించారు. పోలింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని అక్కడ విధుల్లో ఉన్న ప్రిసైడింగ్ అధికారులు, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.

పోలింగ్ తిప్పలు
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం శంకరం పంచాయతీ పరిధిలో కొత్తవలస తాడివలస వేలంపాడు గొప్పూరు మామిడి పాలెం గ్రామాల గిరిజనులు ఓట్లు
వేయడానికి ట్రాక్టర్ల మీద ఇబ్బందుల పడుతూ వెళ్తున్న పరిస్థితి.

పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ హరీష్
కోనసీమ(ఆలమూరు) : స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సరళిని ఎంపీ హరీష్ మాధుర్ మండలంలోని మడికిలో కూటమి(టిడిపి) జెడ్పిటిసి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు, పార్టీ శ్రేణులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆయన ప్రశంసించారు.

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలోని వీరప్పల్లి పంచాయతీ కేంద్రంలో పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ రెడ్డి, ఆయన సతీమణి ఎన్.రేణుకా రెడ్డి వారి వెంట పంచాయతీ నాయకులు మాజీ ఎంపిటిసి సుబ్రహ్మణ్యం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రిగ్గింగ్ జరుగుతోంది : ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
ప్రజాశక్తి-రాప్తాడు : అనంతపురం జిల్లా రాప్తాడు మండల వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద గందరగోళం.
- కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ జరుగుతుందని సమాచారంతో బయలుదేరడంతో అడ్డుకున్న పోలీసులు.
- ప్రశాంతమైన వాతావరణంలో మేము ఓటింగ్ వేయిస్తున్నామని పోలీసులు చెప్తున్న బయలుదేరడంతో అడ్డగించిన పోలీసులు.
- అనంతరం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నంలో పోలీసుల తోపులాట


వైసిపి ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్
నోటీసులు జారీ చేయడం సరికాదు : మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు
మార్కాపురం జిల్లా: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని లేపి పోలీసులు హౌస్ అరెస్ట్ నోటీసులు ఇవ్వడం ఏమిటని కనిగిరి మాజీ ఎమ్మెల్యే , విశాఖపట్నం పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు కదిరి బాబురావు అన్నారు. గురువారం శీలంవారిపల్లి గ్రామంలోని మాజీ ఎమ్యెల్యే కదిరి బాబురావు స్వగృహంలో సి ఎస్ పురం ఎస్ఐ ఉదయం 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో హౌస్ అరెస్టు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కదిరి బాబురావు మాట్లాడుతూ తనపై తనపై ఎలాంటి రౌడీషీట్లు కానీ క్రిమినల్ కేసులు గాని లేవని అలాంటప్పుడు సెక్షన్లు లేకుండా తనకు పోలీసులు నోటీసులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు .సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లో నుండి బయటకు రావద్దని చెప్పడం ఏమిటన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంగా గెలవాలి కానీ పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించి భయభ్రాంతులకు గురి చేయాలని చూడడం ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంస్కృతి సరైనది కాదని కదిరి బాబురావు అన్నారు.

ఎన్నికలను బహిష్కరించిన రొంగళివానిపాలెం గ్రామస్తులు
అనకాపల్లి: మండలంలోని రొంగళివాని పాలెం గ్రామంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. ఇటీవల ప్రకటించిన సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ను బీసీ మహిళ నుంచి ఎస్సీ మహిళకు మార్చడంతో గ్రామస్తులందరూ ముక్తకంఠంతో బీసీ మహిళ అభ్యర్థికే రిజర్వేషన్ ఖరారు చేయాలని లేని పక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నాలుగు గంటలు కావస్తున్న ఇప్పటికీ ఏ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోలేదు. గ్రామంలో మొత్తం 759 ఓటర్లు ఉండగా ఏ ఒక్కరూ ఓటు హక్కును ఇప్పటివరకు వినియోగించలేదు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులు ఏకమై ఎన్నికలను బహిష్కరించారు. గ్రామస్తులతో నాలుగు గంటలుగా మాట్లాడుతున్న మండల, జిల్లా స్థాయి అధికారులు.

అనకాపల్లిలోని నక్కపల్లిలో 51వ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కామనగరువు మెండువారిపేట పోలింగ్ స్టేషన్లో ఓటు వేసిన 103 సంవత్సరాల వృద్ధురాలు.

పోలింగ్ బూత్ మార్పుపై గ్రామస్తుల ఆగ్రహం
- ఎన్నికలను బహిష్కరించిన ప్రజలు!
పశ్చిమ గోదావరి జిల్లా (భీమవరం): సుమారు 40 ఏళ్లుగా కొనసాగుతున్న పోలింగ్ బూత్‌ను మరో ప్రాంతానికి మార్చడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకపురంలో కొనసాగుతున్న పోలింగ్ బూత్‌ను కోమటితిప్పకు మార్చడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును గ్రామస్తులు నిలదీసి, తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలింగ్ బూత్‌ను యథాస్థానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాన్ని అకస్మాత్తుగా మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్తులు, అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ బూత్ మార్పును వ్యతిరేకిస్తూవినాయకపురం ప్రజలు ఎన్నికలను స్వచ్ఛందంగా బహిష్కరించారు. తమ సమస్యను అధికారులు పరిష్కరించే వరకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు.


అన్ని కళ్ళు పోలింగ్ వైపే ...
కృష్ణా జిల్లా (మచిలీపట్నం) : కలెక్టరేట్ నుంచి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.
- పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల రద్దీ, పోలింగ్ నిర్వహణ, సిబ్బంది పనితీరును నిరంతరం సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్.

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య
కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో తన ఓటు హక్కు వినియోగించుకున్న నిడుమోలు మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య.
కృష్ణాజిల్లాలో ఉదయం 11.00 గంటల వరకు 32.62% పోలింగ్ శాతం నమోదు

చిత్తూరు జిల్లాలో 11 గంటల వరకు 32.97% పోలింగ్ నమోదు
* కుప్పం నియోజకవర్గంలో 11 గంటల వరకు 31.35 శాతం పోలింగ్
* కుప్పం నియోజకవర్గవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.
* ఉదయం 11 గంటల వరకు 31.35 శాతం పోలింగ్ నమోదు.
* మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు:
* కుప్పం మండలం – 31.53 శాతం
* శాంతిపురం మండలం – 31.26 శాతం
* గుడుపల్లె మండలం – 33.09 శాతం
* రామకుప్పం మండలం – 29.88 శాతం
* నాలుగు మండలాల్లో అత్యధికంగా గుడుపల్లెలో 33.09 శాతం పోలింగ్.
* అత్యల్పంగా రామకుప్పం మండలంలో 29.88 శాతం పోలింగ్ నమోదు.
* నియోజకవర్గవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ.

టిడిపి, వైసిపి పార్టీల మధ్య ఘర్షణ
మన్యం జిల్లా (మక్కువ) : డీసెర్లంలో టిడిపి, వైసిపి పార్టీల మధ్య ఘర్షణ క్యూలైన్ల వద్ద ప్రచారం చేస్తూ వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ.
- పోలీస్ సిబ్బంది కొరతతో ఓటర్లకు అవస్థలు.

తూర్పు గోదావరి జిల్లా : తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతి
తూర్పు గోదావరి జిల్లాలో 11గంటల వరకు 30.88% ఓటింగ్ పోలైనట్లు అధికారులు ప్రకటించారు .

జడ్పిటిసి ఎన్నికల్లో ఉద్రిక్తత
- పెట్రోల్ బాంబులతో దాడులు
ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. గురువారం జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా మండల పరిధిలోని ఎర్రిపల్లె గ్రామంలో వైసీపీ శ్రేణులపై టిడిపి మూకలు పెట్రోల్ బాంబుతో దాడులు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే కొత్తపల్లి, మోటు నూతనపల్లి గ్రామాలలో టిడిపి మూకలు వైసీపీ మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం
స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ప్రజాశక్తి-ఏలూరు సిటీ : పెదపాడు మండలంలోని వట్లూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటు వేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో తన బాధ్యతను నిర్వర్తించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటు కీలకమని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, పి ఎర్రేపల్లె సెగ్మెంట్ కి సంబంధించిన అబ్బగుండు గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు.
తమ ఊరు సమస్యలు ఏ రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ సమస్య తీర్చనందుకు ఎన్నికలను బహిష్కరిచారు.

ప్రకాశం జిల్లా పెరిదేపిలో ఓటు హక్కు వినియోగించుకున్న సిపిఎం అభ్యర్థి పుట్టా విజయలక్ష్మి

పోలింగ్ కు 'చీకటి' కష్టాలు
- ఎలక్షన్ కు అంత హడావుడి.. ఓ పక్క తుఫాను ప్రభావంతో కరెంటు లేక ఇబ్బందులు.. ఎంపీటీసీ జడ్పిటిసి పోలింగ్ సిబ్బంది కేండిల్ వెలుతురులో సిద్ధం చేసుకుంటున్న వైనం.
- ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రూరల్ మండలంలో ఎలక్షన్ సిబ్బంది ఏర్పాటు చేసిన సెంటర్లో కరెంటు కష్టాలు.
- పల్లెల్లో కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు.. ఒకపక్క ఎలక్షన్.. కరెంటు సిబ్బందిపై ఒత్తుడులు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

బాపట్ల జిల్లా ఇసుక దర్శిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

.వేటపాలెం మండలం కొత్త పేటలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న స్థానిక శాసనసభ్యులు ఎం.మాల కొండయ్య, కుటుంబ సభ్యులు

సిపిఎం అచ్చుతాపురం మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన గంగిరెడ్డి నారాయణమ్మ ఎర్రవరం గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతం
ఉదయం 9 నుండి 11 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 27.25 శాతం ఓట్లు పోలయ్యాయి.

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కాకినాడ కాకినాడ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ గురువారం కరపలోని పీఎం శ్రీ ఎస్ఎన్ఎస్ఎం జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పోలీసు బలగాల మోహరింపును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు సురక్షితంగా తరలించే వరకు సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఎక్కడైనా చిన్నపాటి సమస్య తలెత్తినా తక్షణమే స్పందించి రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బలగాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు, ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ తనిఖీల్లో ఎస్బీ డీఎస్పీ కె.వి.వి. సత్యనారాయణ, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఓటింగ్ ను బహిష్కరించిన గ్రామస్తులు
మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఓటింగ్ ను గ్రామస్తులు బహిష్కరించారు. ఓట్ల సమయంలో మాత్రమే తమ గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని మిగతా సమయంలో గ్రామ అభివృద్ధికి ఏమాత్రం తోడ్పాటు అందించటం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కలగరలో ఇరు వర్గాల మధ్య తోపులాట.. చదరగొట్టిన పోలీసులు
- 10గంటలకు పోలింగ్ శాతం - 9.86%

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో 106 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధురాలు కృష్ణంశెట్టి భూదేవమ్మ
మణికొండ -2 బూత్ నెం -37లో బాధ్యత గల పౌరురాలిగా ఓటు వేశారు.

అరకులోయ మండలం లోతేరు పంచాయతీ కేంద్రంలో భారీగా తరలివచ్చిన ఓటర్లు

అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో 26,200 ఓట్లుకు గాను ఉదయం 9 గంటలకు 4200 ఓట్లు (16%) పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

రాజమహేంద్రవరం డివిజన్‌లోనే పోలింగ్ జోరు
- ఉదయం 9 గంలకే జిల్లావ్యాప్తంగా 12.09 శాతం ఓటింగ్
- రాజమహేంద్రవరం డివిజన్‌లో 13.25 శాతం.. కొవ్వూరు డివిజన్‌లో 10.54 శాతం నమోదు
- రాజానగరం టాప్.. రాజమహేంద్రవరం రూరల్‌లో అత్యల్పం
ప్రజాశక్తి–రాజమహేంద్రవరం ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లాలో రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 12.09 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 12,02,248 మంది ఓటర్లకు గానూ 1,45,371 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 84,637 మంది పురుషులు, 60,733 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నారు. ప్రారంభ రెండు గంటల్లోనే పురుష ఓటర్లు మహిళల కంటే ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడం గమనార్హం.
రాజమహేంద్రవరం డివిజన్ ముందంజ
జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్లలో రాజమహేంద్రవరం డివిజన్ పోలింగ్‌లో ముందంజలో నిలిచింది. ఈ డివిజన్ పరిధిలో 6,88,624 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల వరకు 91,214 మంది ఓటు వేశారు. దీంతో 13.25 శాతం పోలింగ్ నమోదైంది. డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో రాజానగరం మండలం అత్యధికంగా 16.39 శాతం పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అత్యల్పంగా 10.39 శాతం పోలింగ్ నమోదైంది.
కొవ్వూరు డివిజన్‌లో నెమ్మదిగా..
కొవ్వూరు డివిజన్‌లో పోలింగ్ ప్రారంభంలో కొంత నెమ్మదిగా సాగింది. ఈ డివిజన్ పరిధిలో 5,13,624 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల వరకు 54,157 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10.54 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం తొమ్మిది మండలాల పరిధిలో ఉండ్రాజవరం మండలం అత్యధికంగా 13.54 శాతం పోలింగ్‌తో ముందంజలో ఉంది.
పురుష ఓటర్లే అధికం
జిల్లావ్యాప్తంగా నమోదైన పోలింగ్ గణాంకాలను పరిశీలిస్తే పురుష ఓటర్లు మహిళల కంటే అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 84,637 మంది ఓటు వేయగా, మహిళా ఓటర్లు 60,733 మంది మాత్రమే ఓటు వేశారు. ఇతరుల విభాగంలో ఒక ఓటు నమోదైంది. రెండు డివిజన్ల మధ్య పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే రాజమహేంద్రవరం డివిజన్ కొవ్వూరు డివిజన్ కంటే 2.71 శాతం అధికంగా ఉంది.

విజయవాడ గ్రామీణం నున్న జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు.
- ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొంటూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న మహిళలు.
- ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు తరలివస్తున్న ఓటర్లు.
- ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ.

ఏలూరు జిల్లా దుగ్గిరాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
https://prajasakti.com/ap-news/amaravati/district-wise-polling-percentage-till-9-am
ఉదయం 9 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు కోసం పై లింక్ ని క్లిక్ చేయగలరు

రోడ్డు కోసం ఓట్లు వేస్తున్నాం . .
- మూడు కిలోమీటర్లు డోలుమోతలు
- జీలుగులోవ గిరిజనులు వినూతన కార్యక్రమం
అనకాపల్లి జిల్లా రావికత oమండలం చీమలపాడు పంచాయతీ జీలుగులోవ పశువులు బంద pvtg కొంది గిరిజనులు 20 మందికి కొత్తగా ఓట్లు వచ్చాయి. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా మొదటిసారి ఓట్లు ఇచ్చిన అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఓట్లు వేయడం కోసం కొర్ర గాసన్న(80) వృద్ధుడు నడవలేని పరిస్థితిలో గ్రామస్తులు ఆధ్వర్యంలో డోలి కట్టి చీమలపాడు పోలింగ్ కేంద్రానికి కనీసం 13 కిలోమీటర్ల దూరం మోసుకొని వచ్చారు. ''నేటికీ మాకు రోడ్డు లేదు.. రోడ్డు వేయండి. మేము ఓటు వేస్తున్నాం.'' అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా పోలింగ్ కేంద్రాన్ని బయలుదేరారు. ఈ కార్యక్రమానికి కొర్ర బాలరాజు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు. జెడ్ కొత్తపట్నం ఎంపీటీసీ అభ్యర్థి సింగర్ పాలసీయా తదితరులు పాల్గొన్నారు.

రాప్తాడులో తొలి గంటలో 6.77 శాతం నమోదు!
- భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ
ప్రజాశక్తి-రాప్తాడు : అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే 6.77 శాతం ఓటింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మండలవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది.

చంద్రగిరిలో ప్రశాంతంగా పోలింగ్
బూత్‌ల వద్ద పోలీసు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, వివాదాలు తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఆయా పంచాయతీ అధికారులు సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
- పోలీస్ ఉన్నతాధికారులు మండలంలోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అన్ని పోలింగ్ బూత్‌లను క్షేత్రస్థాయిలో స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లు ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, కేంద్రాల వద్ద అల్లర్లు లేదా ఘర్షణలకు దిగినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

చంద్రగిరిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓ విభిన్న ప్రతిభావంతుడు

తూర్పు గోదావరి జిల్లా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీల్ చైన్ లో వెళ్తున్న వృద్ధురాలు

ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధురాలు

విజయనగరం జిల్లాలో ఓటు వేసేందుకు వృద్ధురాలిని పోలింగ్ కేంద్ర వద్దకు తీసుకెళుతున్న వ్యక్తి

విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 38, 39 పోలింగ్ బూతులకు వెళ్లేందుకు గ్రౌండ్ బురదమయం
అయినందున పాడుబడి, మూతబడిన భవనము నుంచి ప్రమాదం పొంచి ఉన్న మార్గం గుండా ఓటు వేసేందుకు వెళ్తున్న ఓటర్లు

స్టాంపు పాడ్ లేక గంటపాటు నిలిచిపోయిన పోలింగ్
ప్రజాశక్తి-నూజివీడు టౌన్ : ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో స్టాంప్ ప్యాడ్ పనిచేయని కారణంగా గురువారం పోలింగ్ గంట పాటు నిలిచిపోయింది. గ్రామంలోని నిమ్మగడ్డ నరసింహ అనే ఓటర్ మాట్లాడుతూ ఐడి కార్డులు లేని సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. స్టాంప్ ప్యాడ్ పనిచేయక ఓటింగ్ నిలిచిపోయిందన్నారు. పోలింగ్ బూత్ లో కలిగిన అసౌకర్యంతో ఓటర్లకు ఇబ్బందులు తప్పలేదన్నారు.

చిత్తూరు జిల్లా కార్వేటినగరం బూతు నెంబర్ 22ను పరిశీలిస్తున్న స్పెషల్ ఆఫీసర్

కుప్పం : కుప్పం మండలం కంగుంది పంచాయతీ పరిధిలోని జెడ్.పీ.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో
ఓటు హక్కును వినియోగించుకున్న ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం.

క్రచెస్ సహాయంతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ
అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా క్రచెస్ సహాయంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ఎన్నికల్లో తన వంతు బాధ్యతగా ఓటు వినియోగించుకున్నారు.

భార్య మరణించిన బాధలోనూ ఓటు వేసిన భర్త
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పోలింగ్ కేంద్రంలో భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. యానాదిపల్లికి చెందిన మునెప్ప భార్య రాములమ్మ అనారోగ్యంతో రాత్రి మృతి చెందారు. భార్య మరణించిన బాధలో ఉన్నప్పటికీ, మరుసటి రోజే పోలింగ్ కేంద్రానికి వచ్చిన మునెప్ప తన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువను చెప్పారు. ఈ ఘటన స్థానికులను భావోద్వేగానికి గురిచేసింది.

మన్యం జిల్లా ఎర్రయ్య అనే వృద్ధుడిని ఓటు వేయించడానికి తీసుకెళ్తున్న యువకులు

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని డోకిపర్రు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. ఓటు నమోదు కోసం బారులు తీరిన ఓటర్లు

సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల పరిధిలో సమస్యాత్మక గ్రామాలుగా పరిధిపేట, ఇబ్రహీంబాద్, బడివానిపేట, కుప్పిలి, కేశవరావుపేట, ఎస్ ఎం పురం గ్రామాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం పర్యవేక్షిస్తున్నారు.

చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో ఓటు చేసేందుకు వరుసలో నిలబడిన ఓటర్లు

వీల్ చైర్స్ లేక ఇబ్బంది పడుతున్న ఓటర్లు
విస్సన్నపేట: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో వీల్ చైర్స్ లేక కుర్చీలపై ఓటర్లను ఎలక్షన్ బూత్ వద్దకు తరలిస్తున్న సహాయకులు. బైక్ పై ఓటర్లను తరలిస్తున్న దృశ్యాలు.

చీరాల విజయనగర కాలనీలో 35 నిముషాలు ఆలస్యంగా పోలింగ్
- కరెంటు కోతతో ఇక్కట్లు . .
ప్రజాశక్తి-చీరాల: చీరాలలో ప్రారంభమైన ఓటింగ్. రాత్రి నుండి వర్షా ప్రభావంతో చీరాల మండలం విజయనగకాలనీ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం 7:38 ప్రారంభమైంది. తుఫాను ప్రభావంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో కిటికీల వెలుతురులోనే పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి
ప్రజాశక్తి-సోమల: అన్నమయ్య జిల్లా సోమల జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎర్రాతి వారి పల్లె గ్రామంలోని పోలింగ్ బూతులో పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత తమ ఓటు హక్కును వినియోగించారు

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థికి అధికార పార్టీ ఏజెంట్లు
బ్రహ్మంగారిమఠం: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి జోగయ్య ఏజెంట్ల నియామక వ్యవహారం రాజకీయ వివాదానికి దారితీసింది. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఏజెంట్ల ఫారాలపై ముందుగానే సంతకాలు చేసి, వారినే ఏజెంట్లుగా నియమించుకున్నారు. మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చునేందుకు వెళ్లగా, అప్పటికే ఏజెంట్లు నియమితులయ్యారని, తమకు అనుమతి లేదంటూ వారిని వెనక్కి పంపారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నియమించిన ఏజెంట్లు తమ పార్టీకి చెందిన వారు కాదని పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు మండలం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతోందని నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఏజెంట్ల నియామక వ్యవహారంపై ఎన్నికల అధికారులు స్పందించి, నిబంధనల ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)