సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముద్దనూరు విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక

1 గంట క్రితం

kadapa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు : ముద్దనూరు బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగిన హాకీ క్రీడల పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 విభాగంలో ఎస్.జుబేర్(ముద్దనూరు), అండర్-14 విభాగంలో రవిచంద్ర(ముద్దనూరు), వి.హారిక (కొసినేపల్లె ) రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఓబులేసు తెలిపారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల హెచ్ ఎమ్ ఓబులేసు, పిడి, ఉపాద్యాయులు విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాణించాలని హెచ్ ఎమ్,ఉపాద్యాయులు,తల్లిదండ్రులు ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్