ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు

1 గంట క్రితం

Municipal polling several prominent figures cast their votes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 10:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఎపి లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్‌, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి ఓటు వేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య వసుంధరతో కలిసి వచ్చి ఓటు వేశారు. విజయవాడలో కూటమి మేయర్‌ అభ్యర్థి వంగవీటి రాధా, స్వతంత్ర అభ్యర్థి ఎబి వెంకటేశ్వరరావు ఓటు వేశారు. విశాఖపట్నంలోని ఎన్‌.టి.కాలేజ్‌ పోలింగ్‌ కేంద్రంలో కూటమి మేయర్‌ అభ్యర్థి ముక్కా శ్రావణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్