ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బూతుల్లో ఏజెంట్ లేకుండా ఎన్నికలా ? : వైఎస్.జగన్

1 గంట క్రితం

Elections at polling booths without an agent
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 11:57 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- దొంగ ఓట్లు వేసే వారికి పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్నారు

- నేను ఓటు వేసే పోలింగ్ కేంద్రంలోని ఏజెంట్లు, చైర్మన్ అభ్యర్థి పైనే దాడులు

- ఓటర్లను రానీకుండా అడ్డుకున్నారు ...

- పోలింగ్ కేంద్రాలను ఆక్రమించిన టిడిపి గుండాలు

-ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశాం

-70 మంది ఏజెంట్లతో ఆర్ ఓ దగ్గరికి వెళ్తున్నా

- మీడియాపై కూడా దాడులు


ప్రజాశక్తి పులివెందుల టౌన్ (కడప) : బూతుల్లోకి ఏజెంట్ రాకుండా పోలీసులు దగ్గరుండి ఎన్నికల నిర్వాహకులకు, టిడిపి గూండాలకు సహకరిస్తున్నారని, తాను ఓటు వేసే పోలింగ్ కేంద్రంలో మాత్రమే ఏజెంట్లు ఉన్నారని, తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పోలింగ్ కేంద్రాలను టిడిపి గూండాలు ఆక్రమించారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా .... పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... వైసిపి చైర్మన్ అభ్యర్థి వై ఎస్ ప్రమీలమ్మ పై దాడి చేయడం జరిగిందన్నారు. ఓటు వేయడానికి వెళ్లిన వారిని మీ ఓటు వేసేశామని చెప్పి వెనక్కి పంపుతున్నారన్నారు. మరికొన్నిచోట్ల ఓటు వేయడానికి పోయిన వారిపై దాడి చేశారన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులను పోలీసులు స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు. మీడియా పై కూడా దాడులు చేశారన్నారు. 70 మంది ఏజెంట్లతో పులివెందుల మున్సిపాలిటీ ఆర్వో దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకుండా ఎన్నికలను నిర్వహిస్తున్నారన్నారు. పులివెందుల కడప జమ్మలమడుగు మదనపల్లి తాడపత్రి చీమకుర్తి మున్సిపాలిటీలలో జరిగిన దౌర్జన్యాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళతామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇదంతా చూస్తూ ఉన్నారన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదు అని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత అధికార పార్టీ, అధికారంలో ఉన్నవారిపై ఉందన్నారు. ఇంత దారుణం చేస్తున్నారని... రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు అని వైఎస్.జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్