- సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థి వార్డులో నిబంధనలు తూచ్..
- 33వ వార్డులో టీడీపీ కార్యకర్తల తీరుపై సీపీఎం అభ్యర్థి అభ్యంతరం
- చోద్యం చూస్తున్న ఎన్నికల అధికారులు, పోలీసులు
ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : సేవ పేరుతోనూ రాజకీయ ప్రచారమేనా.. ? అన్నట్లుగా చీరాల మున్సిపల్ ఎన్నికల్లోని 33వ వార్డులో పరిణామం చోటుచేసుకుంది. దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తరలించే సమయంలో టిడిపి కార్యకర్తలు సైకిల్ గుర్తును ప్రదర్శిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ సిపిఎం అభ్యర్థి పి.కొండయ్య, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సేవ ముసుగులో ఎన్నికల ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ వ్యవహారం జరుగుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం అభ్యర్థి కొండయ్య కోరారు. ఇంత జరుగుతున్న పోలీసులు, ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తి ఉండటం ఉండటం గమనార్హం.








కామెంట్‌లు (0)