ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిల్లాలో 5 పురపాలక సంఘాలు,1 నగర పంచాయతీలో ఆదివారం జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా సగటున 32.09 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే పిఠాపురంలో అత్యధికంగా 33.70 శాతం పోలింగ్ నమోదైంది. ఏలేశ్వరంలో 32.70 శాతం, పెద్దాపురంలో 32.80 శాతం, సామర్లకోటలో 32.22 శాతం, గొల్లప్రోలులో 31.26 శాతం, తునిలో 29.71 శాతం పోలింగ్ నమోదైంది. ఆరు పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, మధ్యాహ్నం సమయానికి ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
కాకినాడ జిల్లాలో 11 గంటలకు 32.09 శాతం పోలింగ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)