ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

2 గంటల క్రితం

Darsi MLA Buchepalli Siva Prasad Reddy placed under house arrest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చీమకుర్తిలోని నివాసం వద్ద పోలీసుల పహారా.. ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధం


దర్శి (ప్రకాశం) : దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. చీమకుర్తి పట్టణంలోని గాంధీనగర్‌ మొదట్లో ఉన్న ఆయన నివాసంలోనే నిర్బంధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నివాసం చుట్టూ పోలీసు బలగాలను మోహరించి అష్టదిగ్బంధనం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దీంతో చీమకుర్తిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్