న్యూఢిల్లీ : ఇండియా బ్లాక్ పిలుపునిచ్చిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ కి మద్దతుగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్‌ఐ) భారీ ప్రదర్శన చేపట్టింది. ఆదివారం సుర్జీత్ భవన్ నుండి రామ్‌లీలా మైదాన్ ఎస్‌ఎఫ్‌ఐ నేతలు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్, ఓట్ల చోరీకి పాల్పడిన సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ 'ఇండియా బ్లాక్’ భారీ మార్చ్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తోందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సంజయ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్‌లీలా మైదాన్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ మార్చ్ కోసం తరలివచ్చారని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ మార్చ్‌లో పాల్గొంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ, అమిత్‌షా ప్రభుత్వం సిఇసి జ్ఞానేశ్ కుమార్‌ను పావుగా వాడుకుంటూ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని గత కొంతకాలంగా బలమైన ఉద్యమం కొనసాగుతోందని, ఆ ఉద్యమ నేపథ్యంలోనే నేడు ఈ భారీ ర్యాలీ జరుగుతోందని చౌహాన్ అన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్‌ను రద్దు చేయాలని, ఓటర్ల జాబితాల నుండి తొలగించిన 13.5 కోట్ల మందిని తిరిగి చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఓట్ల చోరీలో భాగస్వామిగా ఉన్న జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన సర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటంతో పోలుస్తూ, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే ఈ ఉద్యమ లక్ష్యమని చౌహాన్ పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ఏ ప్రయత్నమైనా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. బిజెపియేతర రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యావంతులు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
‘చలో ఢిల్లీ’ మార్చ్ కి మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ భారీ ప్రదర్శన
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)