సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు : సిఎం చంద్రబాబు

07 ఆగస్టు, 2026

National Handloom Day greetings to weavers: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 09:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా .... సిఎం చంద్రబాబు నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని చాటే చేనేత కళను ముందుకు తీసుకువెళుతున్న చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందులో భాగంగానే ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభిస్తున్నామన్నారు. విద్యుత్ రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ నేతన్నలకు దన్నుగా ఉన్నామని చెప్పారు. నేడు 71,536 చేనేత కుటుంబాలకు ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా సాయం చేస్తున్నామని తెలిపారు. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున రూ.179 కోట్లు నేతన్నలకు అందిస్తున్నామన్నారు. చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సాయం అందిస్తోందని, అంతా చేతులు కలుపుదాం....చేనేత కళను కాపాడుదాం అని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్