బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మండల ప్రజలకు నూతన బస్సు సర్వీస్

1 గంట క్రితం

chagallu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 03:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- చాగల్లు : చాగల్లు మండలం దారవరం గ్రామంలో నూతన బస్సు సర్వీస్‌ను శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ నూతన బస్సు సర్వీస్ ద్వారా దారవరం, పరిసర గ్రామాల ప్రజలకు కొవ్వూరు, రాజమహేంద్రవరం ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

 ప్రతి రోజూ ఉదయం 8:30 గంటలకు నిడదవోలు నుంచి బయలుదేరి దారవరం → మార్కొండపాడు → చంద్రవరం → మల్లవరం → గౌరిపల్లి → పసివేదల → వేములూరు → కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం వరకు ఈ బస్సు సర్వీస్‌ నడపబడుతుంది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన బస్సు సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. దీంతో ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం కానుందని అన్నారు.  మండలంలో ఊనగట్ల గ్రామంలో వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం కింద మంజూరైన రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుపతి స్కూల్, చాగల్లు పరిధిలో తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన వరి చేలు, పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించి, రైతులకు అవసరమైన సహాయక చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్