ప్రజాశక్తి-ఉండ్రాజవరం
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలో వేలివెన్ను శిరిగిన వెంకన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచి, రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికైనట్లు హెచ్ఎం కె.లక్ష్మీ గణేష్ బుధవారం తెలిపారు. జిల్లాస్థాయిలో ఇటీవల జరిగిన అండర్-14 జావలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన కె.జయలక్షీ గాయత్రి, విఎల్ నరసింహా, అండర్-16 విభాగంలో సిల్వర్ పతకం సాధించిన బి.జయకృష్ణ కర్నూలులో అక్టోబర్ 2, 3 తేదీలలో జరిగే 41వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని హెచ్ఎం తెలిపారు. విజేతలను ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, గ్రామ పెద్దలు బూరుగుపల్లి శ్రీనివాసరావు, పిడి పి.వీరన్నబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో విజేతలు కావాలని ఆకాంక్షించారు.







కామెంట్‌లు (0)