బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

NCERT : చరిత్ర పాఠ్యాంశాల తొలగింపుపై విమర్శల పరంపర

1 గంట క్రితం

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల్లో మళ్లీ మార్పులు చేయడం వివాదాస్పదంగా మారింది.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 03:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల్లో మళ్లీ మార్పులు చేయడం వివాదాస్పదంగా మారింది. తొమ్మిదో తరగతి సామాజిక శాస్త్రం (సోషల్ సైన్స్) పాఠ్యపుస్తకాల్లో చేసిన నూతన మార్పుల్లో భాగంగా ప్రపంచ చరిత్రకు చెందిన 'ఫ్రెంచ్ విప్లవం', 'రష్యన్ విప్లవం' వంటి కీలక పాఠ్యాంశాలను తొలగించినట్లు సమాచారం.


తొలగించిన పాఠాల స్థానంలో మొఘలులు, తురకల పాలనకు వ్యతిరేకంగా రాజపుత్రులు, మరాఠాలు, సిక్కులు, జాట్‌లు చేసిన పోరాటాలు, ప్రతిఘటనలకు సంబంధించిన పాఠాలను చేర్చారు.


"భారత ఉపఖండం సుదీర్ఘకాలం పాటు మతపరమైన వివక్ష, సామాజిక కష్టాలతో కూడిన నిరంతర దండయాత్రలు, యుద్ధాలను ఎదుర్కొంది. సరిహద్దుల్లోకి చొరబడటానికి ప్రయత్నించిన విదేశీ దండయాత్రికులను స్థానిక శక్తులు ప్రతిఘటించాయి. ఈ పోరాటం సైనిక, సాంస్కృతిక స్థాయిల్లో జరిగింది. అయినప్పటికీ, భారతీయ సంస్కృతి తన ప్రాథమిక భావాలను, విలువలను కాపాడుకుంటూ తన జీవశక్తిని నిలబెట్టుకున్న కాలమిది. బాహ్య ముప్పుల నుండి తమను తాము రక్షించుకోవడమే కాకుండా, స్వదేశీ సంప్రదాయాలను కాపాడుకోవడంలో భారతీయ సమాజం దృఢంగా నిలిచింది" అని కొత్తగా చేర్చిన భాగాల్లో పేర్కొన్నారు.


అలాగే, అక్బర్‌కు వ్యతిరేకంగా మహారాణా ప్రతాప్ చేసిన యుద్ధాన్ని ఈ పాఠాల్లో ప్రత్యేకంగా ప్రశంసించారు. వీటితో పాటు కాళీ, దుర్గ, భవాని వంటి హిందూ దేవతల ప్రస్తావనను కూడా పాఠ్యపుస్తకాల్లో పొందుపరచడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్