బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమత్స్యకారులకు కొత్త వలలు

48 నిమిషాల క్రితం

pavan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 11:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె పల్లెపాలెంలో అగ్ని ప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులకు నష్టపరిహారం అందించడంతోపాటు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.0 పథకం కింద కొత్త వలలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. బాధిత మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయం అందించాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులు షెడ్లలో భద్రపరిచిన 250 నుంచి 300 వలలు పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో వేటకు వెళ్లకుండా వలలను షెడ్లలో ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పవన్‌‌కు ప్రకాశం జిల్లా కలెక్టరు వివరించారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని పవన్‌ ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్