శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి కొత్త పాలకవర్గాలు

4 రోజుల క్రితం

corpo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 09:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో తొలి సమావేశాలు

- మేయర్లు, ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం.. డిప్యూటీల ఎన్నిక

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పట్టణ స్థానిక సంస్థల్లో నేటి నుంచి కొత్త పాలకవర్గాల పదవీకాలం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇది వరకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం–1994, మున్సిపాలిటీల చట్టం–1965 ప్రకారం ఎన్నికైన సభ్యుల పదవీకాలం తొలి సమావేశం జరిగిన తేదీ నుంచి ఐదేళ్లపాటు కొనసాగుతుంది. ఈ నిబంధనల మేరకు ఈ నెల 23న తొలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధిత మున్సిపల్ కమిషనర్లు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్