శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరువు రుణాలకు తనఖా నిబంధన వద్దు

5 రోజుల క్రితం

crop
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి కౌలు రైతు సంఘం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: కరువు మండలాల్లో పంట రుణాల రీషెడ్యూల్‌ సందర్భంగా రూ.2 లక్షలు దాటాయనే కారణంతో బ్యాంకులు మార్ట్‌గేజ్‌, ష్యూరిటీ, గ్యారెంటీలు అడగకుండా రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర కౌలు రైతు సంఘం డిమాండ్‌ చేసింది. శనివారం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్ఎల్ బిసి) రాష్ట్ర కన్వీనర్‌ శ్రీధర్‌బాబు, కో కన్వీనర్‌ శ్రీనివాసరావులను కలిసి సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి బలరాం, ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు వినతిపత్రం అందజేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం 412 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని, ఇటీవల ఆర్నబ్‌, మురసు తుపాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పాత రుణాల రీషెడ్యూల్‌తో పాటు రబీ పంటకు కొత్త రుణం కలిపినప్పుడు మొత్తం రూ.2 లక్షలు దాటుతోందని, దీంతో బ్యాంకులు మార్ట్‌గేజ్‌ కోరుతున్నాయని పేర్కొన్నారు. స్టాంప్‌ డ్యూటీ చెల్లించే స్థోమత లేని రైతులకు ఇది అదనపు భారంగా మారిందన్నారు. ఎస్‌ఎల్‌ బిసి జోక్యం చేసుకుని ప్రభుత్వానికి సమస్యను వివరించాలని, రీషెడ్యూల్‌ చేసిన పాత రుణం, కొత్త రబీ రుణం కలిపి రూ.2 లక్షలు దాటినా ఎలాంటి తనఖా, హామీ లేకుండా రుణాలు మంజూరయ్యేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్