- మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 33 రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి శనివారం వరకు కొత్త కేసులు నమోదు కాలేదని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు ఏవీ లేవని పేర్కొన్నారు. జూన్ 24 నుంచి సెప్టెంబరు 25 వరకు 94 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,086 కరోనా నమూనాలను పరీక్షించామని వెల్లడించారు. వీటిలో 78 మందికి కరోనా నిర్ధారణ కాగా, 74 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత శాఖ దాడులు
ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత శాఖ అధికారులు శనివారం విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారని మంత్రి సత్యకుమార్ మరో ప్రకటనలో తెలిపారు. 28 జిల్లాల్లో ఒకేసారి చేపట్టిన ఈ తనిఖీల్లో 66 హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార సంస్థలను పరిశీలించారని వివరించారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన 25 సంస్థలను మూసివేశారని, 45 సంస్థలకు మెరుగుదల నోటీసులు జారీ చేశారని, 30 చట్టపరమైన కేసులు నమోదు చేశారని వివరించారు.









కామెంట్‌లు (0)