ప్రజాశక్తి-అమరావతి : మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు మరో రోజు గడువు పెంచేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఇసి) ఆదేశించలేమని హైకోర్టు పేర్కొంది. గడువు పెంపునకు ఉత్తర్వులివ్వాలంటూ వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. నామినేషన్ల దాఖలుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసినందున ఈ దశలో సమయం పొడిగిస్తే ఎన్నికల షెడ్యూల్ మారిపోయే అవకాశం ఉందని ఎస్ఇసి తరపున న్యాయవాది చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకుంది. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత మరో రోజు సమయం పెంచాలని ఆదేశిస్తే ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకున్నట్లవుతుందని తేల్చింది. ప్రధాన అప్పీళ్లపై విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఇసిని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎన్ జయసూర్య, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
నామినేషన్ల గడువు పెంపునకు ఆదేశాలివ్వలేం : హైకోర్టు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 11:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)