శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బనగానపల్లె వైసిపి మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

5 రోజుల క్రితం

బనగానపల్లె వైసిపి మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
-  20 వార్డు స్థానాలు కూడా..
- ఎంపిడిఒ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కాటసాని ధర్నా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 10:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 20 వార్డు స్థానాలు కూడా..

- ఎంపిడిఒ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కాటసాని ధర్నా

ప్రజాశక్తి - బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ వైసిపి మద్దతుదారు సర్పంచ్‌ అభ్యర్థి అబ్దుల్‌ ఫైజ్‌తో పాటు వైసిపి మద్దతుతో 20 వార్డు స్థానాలకు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మరోవైపు నామినేషన్ల తిరస్కరణకు సంబంధించి పైఅధికారులకు అప్పీలు చేసుకోవాలని రిటర్నింగ్‌ అధికారి సుభాషిణి సూచించారు. సంతకాలు సరిగా లేవంటూ నామినేషన్లను తిరస్కరించడాన్ని తప్పుబడుతూ వైసిపి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎంపిడిఒ కార్యాలయం ఎదుట రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై నంద్యాల వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. వైసిపి మద్దతుతో ముస్లిం మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ సర్పంచ్‌గా పోటీ చేయడానికి ముందుకు రావడంతో, తన భార్య ఎక్కడ ఓడిపోతారో అనే భయంతోనే మంత్రి బిసి జనార్ధన్‌రెడ్డి ఆయన నామినేషన్‌ను తిరస్కరించేలా చేశారని ఆరోపించారు. నామినేషన్లలో ఎలాంటి లోపాలు లేకపోయినా అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్పంచ్‌, 20 వార్డు సభ్యుల అభ్యర్థిత్వాలను తిరస్కరించారని విమర్శించారు. ఉదయం ఎనిమిది గంటలకు స్క్రూటినీకి రావాలని చెప్పి, సాయంత్రం 6.30 గంటలకు నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు చెప్పడం దారుణమన్నారు. వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు కాటసాని ప్రసాద్‌రెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్