శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం

1 గంట క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 12:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- భారత వాతావరణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతాలపై ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సముద్ర మట్టానికి సగటున 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలో శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల పడే అవకాశముందని వెల్లడించింది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల పడే అవకాశం ఉందని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్