శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీటిని ప్రయివేటీకరించే ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకించండి

14 నవంబర్, 2026

koulu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 08:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి కౌలు రైతు సంఘం పిలుపు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రపంచ బ్యాంకు షరతులకు లొంగి వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుతో కూటమి ప్రభుత్వం.. నీటి వినియోగదారులపై భారాలు మోపటానికి పూనుకుందని ఆంధ్రప్రదేశ్‌ ‌కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ పేర్కొంది. వ్యవసాయానికి సాగునీటిని నియంత్రించటానికి వాటర్ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో ప్రైవేట్ సంస్థల లాభాల కోసమే వినియోగదారులపై యూజర్ ఛార్జీల వసూళ్లకు సిద్ధమవుతున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి బలరామ్‌, ఎం హరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాగు, సాగునీరు అందించే బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో భూ యజమానుల కంటే కౌలుదారులే ఎక్కువ మంది సాగుచేస్తున్నారన్నారు. సాగునీరు అందించే బాధ్యత నుంచి భూ యజమానులు వైదొలిగితే వ్యవసాయం సాగుచేయటమే అసాధ్యమవుతుందన్నారు. రైతులు, కౌలు రైతులు ఎల్‌‌నినో, వరుస తుపానులతో అల్లాడిపోతుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నీటిని వ్యాపార సరుకుగా మార్చడం దుర్మార్గమన్నారు. వ్యవసాయానికి ఇప్పటికే యాప్‌ల పేరుతో ఎరువుల వాడకాన్ని నియంత్రించారని, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్‌కు తిలోదకాలు ఇచ్చి స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సిద్ధం చేశారని పేర్కొన్నారు. తాజాగా నీటి మీటర్లతో నీటిని కొనుగోలు చేసి వ్యవసాయం చేయడం అంటే రైతులకు పెనుభారం అవుతుందని అన్నారు. రైతులకు, వినియోగదారులకు నష్టం చేకూర్చే వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ప్రతిపాదనను ఉపసంహరించాలని డిమాండ్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్