ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేరళలోని అలప్పుజ జిల్లా పరిధిలోని చారిత్రక చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మవారి ఆలయాన్ని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకున్నారు.పుష్పాంజలి సేవలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా బాలశివుడిని దర్శించుకుని అర్చనలు చేశారు. అనంతరం వినాయకుడు, నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్‌శాంతి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. దసరా శరన్నవరాత్రుల తొమ్మిది రోజుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు అన్నదానం చేసేందుకు అయ్యే మొత్తం వ్యయాన్ని పవన్ కళ్యాణ్ దేవస్థానం బోర్డుకు విరాళంగా అందజేశారు. ఆరోగ్య ప్రదాయినిగా, త్రిశక్తి స్వరూపిణిగా భక్తులు కొలిచే చెట్టికులంగర భగవతి ఆలయానికి 1200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం రాక్షస సంహారం కోసం శివుడి మూడో కన్ను నుంచి అమ్మవారు జన్మించినట్లు చెబుతారు.
చెట్టికులంగర భగవతి సేవలో పవన్
12 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 11:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)