మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చంద్రబాబుతో పవన్ భేటీ

5 గంటల క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 09:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రి పవన్‌ ‌కళ్యాణ్‌ ‌సమావేశమ య్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు ఇంటికి చేరుకున్న పవన్‌‌కు టిడిపి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ‌స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ ‌త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి చేయాలనే అంశంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలిసింది. కూటమి నుంచే ఒక్కరే పోటీ చేసేలా చూడాలని, రెబల్‌ అభ్యర్ధులు లేకుండా ఉండేలా పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించాలని అనట్లు సమాచారం. ఏ పార్టీకి ఎక్కడ బలం ఉందో అక్కడ అదే పార్టీకి సీటు కేటాయించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా ఏ పార్టీకి ఎంత శాతం సీట్లు కేటాయించాలి, జెడ్‌‌పి చైర్మన్లు, నగర మేయర్‌ ‌స్థానాలు కేటాయింపు ఏ పార్టీకి కేటాయించాలనే అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. కూటమి పార్టీల మధ్య సమన్వయం కోసం నియమించిన కమిటీతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావించినట్లు సమాచారం. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు తో కూడా చర్చించినట్లు తెలిసింది. సమన్వయ కమిటీ సమావేశాల పురోగతిని వారిద్దరి నుంచి అడిగి తెలుసుకునట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్