ప్రజాశక్తి-అమరావతి : రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసి గాయపరిచిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై సిబిఐతో సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మంగళగిరికి చెందిన న్యాయవాది గుండా గోపికృష్ణ ఈ పిటిషన్ వేశారు. గాయపడిన నిందితుడిని అనంతపురం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించే సమయంలో స్ట్రెచర్‌పై తీసుకెళ్లకపోవడంపై ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్, వైద్య రికార్డులు, తదితర ఆధారాలను భద్రపరిచేలా ఆదేశించాలని, మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. మంగళవారం నాడు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.








కామెంట్‌లు (0)