శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరు నెలల్లో పిఆర్‌‌సి నివేదిక ఇవ్వాలి

1 గంట క్రితం

employees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 11:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైఎస్‌ఆర్‌టిఎ, బిటిఎ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నూతన వేతన సవరణ కమిటీ(పిఆర్‌‌సి)కమిషన్‌కు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి గరిష్ఠంగా ఆరు నెలల్లో తన నివేదికను సమర్పించేలా కాలపరిమితిని నిర్దేశించాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్(వైఎస్‌ఆర్‌‌టిఎ), బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌(బిటిఎ) ‌వేరువేరుగా డిమాండ్‌ ‌చేశాయి. గత పిఆర్‌‌సి కాలపరిమితి ముగిసి మూడేళ్లు గడిచిందని, ఈ కాలంలో వేతన సవరణ ప్రయోజనాలు అందక ఉద్యోగులు భారీగా ఆర్థికంగా నష్టపోయారని వైఎస్‌ఆర్‌‌టిఎ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జాలిరెడ్డి, షేక్‌ ‌జంషీద్‌ ‌శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే తీవ్రంగా ఆలస్యమైన పిఆర్‌‌సిపై ఏడాది గడువు ఇవ్వడం ఉద్యోగుల్లో మరింత నిరాశను కలిగిస్తోందని తెలిపారు. నివేదిక వచ్చే వరకు ఉద్యోగులు మరింత ఆర్థిక భారాన్ని భరించాల్సిన పరిస్థితి లేకుండా ప్రభుత్వం వెంటనే కనీసం 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. కమిషన్‌ ‌కాలపరిమితి ఆరు నెలలకు కుదించి ఐఆర్‌ ‌ప్రకటించాలని బిటిఎ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి రామారావు, సిహెచ్‌ ‌రమేష్‌ ‌మరో ప్రకటనలో డిమాండ్‌ ‌చేశారు. గతంలోనే మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఐఆర్ ప్రకటించాల్సి ఉందని తెలిపారు. కనీసం ఇప్పుడైనా 30శాతం ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తునట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్