శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాఠశాల విద్యలో ఆరోగ్యకర ఆహారానికి ప్రాధాన్యం

20 నవంబర్, 2026

education
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 08:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ‘నీట్‌-ఎస్‌’నివేదిక విడుదలలో సమగ్రశిక్ష డైరెక్టర్‌ ‌శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ‘ఆరోగ్యం, పోషకాహారం’పై అవగాహనను పాఠశాల విద్యలో అంతర్భాగంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సమగ్ర శిక్ష డైరెక్టర్‌ ‌బి శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయుల పాత్రను బలోపేతం చేస్తూ, విద్యార్థులు తమ ఎదుగుదలకు మేలు చేసే ఆహారాన్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, యునిసెఫ్‌ సహకారంతో ‘ఎన్‌ఇఎటి-ఎస్‌ ఎపి నివేదికను శుక్రవారం ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలోని 556 పాఠశాలల్లో అందించే భోజనం, విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వసతులు, శారీరక కార్యకలాపాలు, కౌమార వయసు విద్యార్థుల ఆహారపు అలవాట్లపై నిర్వహించిన అధ్యయన వివరాలను నివేదికలో పొందుపరిచినట్లు చెప్పారు. పిల్లలలో సరైన ఆహారపు అలవాట్లను పెంపొందించడానికి కేవలం అవగాహన కల్పించడమే కాకుండా, వారికి పోషకాహారం సులభంగా అందుబాటులో ఉండే వాతావరణాన్ని సృష్టించాలని యునిసెఫ్‌ హైదరాబాద్‌ క్షేత్ర కార్యాలయ అధిపతి జెలాలెమ్‌ తఫస్సే చెప్పారు. దీనికోసం పాఠశాలలు, తల్లిదండ్రులు, స్థానిక సమాజాలు, ఆరోగ్య విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీమ్యాట్ డైరెక్టర్ ఎంఆర్ ప్రసన్న కుమార్, మధ్యాహ్న భోజన పథకం జాయింట్ డైరెక్టర్ ఆర్ఎస్ గంగా భవాని తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్