గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

లారీనీ ఢీకొట్టిన ప్రైవేటు బస్సు - 30మంది ప్రయాణీకులకు గాయాలు

1 రోజు క్రితం

Private bus collides with lorry – 30 passengers injured.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 12:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఏలూరు : హైవే పై ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో 30 మంది ప్రయాణీకులు గాయపడిన ఘటన బుధవారం ఏలూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళుతున్న ఇంటర్‌ సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైవేపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలు కాగా, బస్సు డ్రైవర్ నుజ్జునుజ్జయిన క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే జంగారెడ్డిగూడెం, లక్కవరం పోలీస్ స్టేషన్ల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులందరినీ చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి అసలు కారణాలు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రమాదంతో హైవేపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్