ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజా ఉద్యమాలతోనే సమస్యలకు పరిష్కారం : మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

1 గంట క్రితం

gen z
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 12:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ఉద్యమాలు ఏ రూపంలో వచ్చినా ప్రజల భాగస్వామ్యంతో చేసిన పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఎస్‌విడి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ‘ప్రజాస్వామ్యానికి సవాళ్లు-జన్‘జి’ ఉద్యమంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జన్‘జి’ ఉద్యమాలతో పాటు ప్రజల సమస్యలే ఎజెండాగా ప్రజా ఉద్యమాలు నిర్మితం కావాల్సిన అవసరముందని వివరించారు. రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కును, నిరసన తెలిపే హక్కును, భావ ప్రకటన హక్కును కాలరాస్తున్న మోడీ ప్రభుత్వంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజానీకానికి జన్ జి ఉద్యమం ద్వారా ఉపశమనం లభించిందన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై ఉపా చట్టం కింద కేసులు పెట్టి బెయిల్, విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచుతున్నారని తెలిపారు. తమ మాట వినని వారిపై సిబిఐ, ఇడి, ఆదాయపన్నుశాఖ వంటి కేంద్రప్రభుత్వ సంస్థలతో మోడీ, అమిత్ షా దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి, బిజెపిని బలపరిచే పార్టీలు తప్ప మరేఇతర రాజకీయపార్టీలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రత్యర్ధి పార్టీలను నిలువునా చీల్చి ఎంపిలను బిజెపిలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ‘సర్’ పేరుతో దేశ వ్యాప్తంగా ఐదు కోట్ల ఓట్లను తొలగించారని, రాజ్యాంగబద్దంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ బిజెపికి లొంగిపోయిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక బిల్లులన్నింటికీ టిడిపి, వైసిపి రెండూ మద్దతు పలుకుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని వివరించారు. ఈ సందర్భంగా సీతారం ఏచూరి చిత్రపటానికి ఆయనతో పాటు అతిథులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, కె మోహనరావు, జి సింహాచలం, పి తేజేశ్వరరావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్