సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పులివెందులు మెగా వాటర్‌ గ్రిడ్‌ పథకం త్వరలో పూర్తి

1 గంట క్రితం

Must be careful: Deputy CM Pawan condemns remarks against Minister Anita.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 10:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద వైఎస్సార్ కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంలో మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు తీసుకుంటున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్‌ ‌కల్యాణ్‌ ‌తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోగా, ప్రస్తుతం సుమారు రూ. 426 కోట్ల విలువైన 96 శాతం పనులు పూర్తి చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏడు మండలాల పరిధిలో ఐదున్నర లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ.480 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభమైన పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు చేపట్టామన్నారు. జల్ జీవన్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో 4 ఏళ్ల పాటు పొడిగించడంతో పులివెందుల మెగా తాగునీటి సరఫరా పథకం తిరిగి ఊపిరి పోసుకుందన్నారు. పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా 100 శాతం పూర్తయ్యాయని, లింగాల మండలం పరిధిలో 27 ఆవాసాలకు గాను 24 ఆవాసాలకు త్వరలో తాగునీరు అందుతోందని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా, 65 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 1,111 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు గాను 1,106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యిందని వెల్లడించారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరిందని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్