సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటీఎస్‌ ఉద్యోగుల సమస్యకు ఇకనైనా ముగింపు పలకాలి

2 గంటల క్రితం

sddf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 08:16 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- మూడేళ్లు పూర్తయినా సుదూర ప్రాంతాల్లో కొనసాగించడం సరికాదు

- తాజా సర్క్యులర్‌ మెమోను తక్షణమే అమలు చేయాలి : భవనారి వెంకటేష్‌బాబు

ప్రజాశక్తి - అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ ఆదాయం సుమారు 18 శాతం వృద్ధి సాధించడంలో క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగుల కృషి కీలకమని ది కమర్షియల్‌ ట్యాక్సెస్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు భవనారి వెంకటేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి కొప్పోలు సుధాకర్‌రావు పేర్కొన్నారు. పన్ను పరిపాలనలో సాంకేతికత, డేటా అనలిటిక్స్‌, ఆటోమేషన్‌, క్రాస్‌ వాలిడేషన్‌ వంటి ఆధునిక విధానాలను సమర్థవంతంగా వినియోగిస్తూ ఆదాయ వృద్ధికి చర్యలు చేపడుతున్న అధికారులను, ఉద్యోగులను అభినందించారు. అదే సమయంలో వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆర్డర్‌ టు సర్వ్‌ (ఓటీఎస్‌) ప్రాతిపదికన ఇతర ప్రాంతాలకు పంపిన ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం ఇకనైనా పరిష్కరించాలని కోరారు. ఓటీఎస్‌ ప్రాతిపదికన సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అర్హులైన ఉద్యోగులు జూలై 2026 నాటికే మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారని తెలిపారు. అయినప్పటికీ వారిని ఇంకా అదే ప్రాతిపదికన కొనసాగించడం సముచితం కాదన్నారు.

కుటుంబాలకు 350 కిలోమీటర్లకు పైగా దూరంలో మూడేళ్లుగా విధులు నిర్వహిస్తూ వ్యక్తిగత, కుటుంబ, శారీరక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉద్యోగులు శాఖ ప్రయోజనాల కోసం నిబద్ధతతో పనిచేశారని పేర్కొన్నారు.

మూడు సర్క్యులర్‌ మెమోలు జారీ

ఓటీఎస్‌ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ జూన్‌ 10, జూలై 15 తేదీల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో Circular Memo No.REV01/CCST OCCTE/30/2026, Dt.17.06.2026, Circular Memo No.3347574/REV CT/2026, Dt.23.07.2026 జారీ అయ్యాయని పేర్కొన్నారు.

అయితే ఈ ఆదేశాలు అమలుకు నోచుకోకపోవడంతో సంఘం మరోసారి మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లిందన్నారు. దీంతో ఉద్యోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని తాజాగా Circular Memo No.3387876, Dt.28.08.2026 జారీ అయిందని తెలిపారు.

తాజా ఆదేశాలను అమలు చేయాలి

ఒకే సమస్యపై ప్రభుత్వం పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, మూడు సర్క్యులర్‌ మెమోలు ఇచ్చిన నేపథ్యంలో ఇక ఎలాంటి జాప్యానికీ తావులేకుండా తాజా సర్క్యులర్‌ను అమలు చేయాలని భవనారి వెంకటేష్‌బాబు, కొప్పోలు సుధాకర్‌రావు కోరారు. అర్హులైన ఓటీఎస్‌ ఉద్యోగులను వారి మాతృ/పేరెంటల్‌ డివిజన్లకు పంపి, మూడేళ్లుగా కొనసాగుతున్న సమస్యకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.

సాంకేతిక ఆధారిత పరిపాలనతో పాటు క్షేత్రస్థాయి వ్యవస్థ బలోపేతం, ఉద్యోగుల సంక్షేమానికి సమాన ప్రాధాన్యత కల్పిస్తే వాణిజ్య పన్నుల శాఖ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్