సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నూతన మద్యం పాలసీ పై అవగాహన

1 గంట క్రితం

excise
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 09:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్

ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి ఆదేశాల మేరకు డీపీఈఓ, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఒంగోలు మరియు ఒంగోలు ఎస్ హెచ్ ఓ (I/C) ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నందు తేదీ 26.09.2026న నియోజకవర్గంలోని రెన్యూవల్ కానీ (18) మద్యం దుకాణాల గురించి మద్యం దుకాణాల లైసెన్సీ దారులతోను మరియు ఔత్సాహికులతోనూ సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 ప్రభుత్వం వారిచే కొత్తగా ప్రకటించబడిన మద్యం పాలసీ యొక్క విధి విధానాలను, లాటరీ విధానం ను గురించి మద్యం దుకాణదారులకి వివరించి చెప్పడం జరిగింది.

సమావేశంలో ముఖ్యంగా తెలియపరచబడిన అంశాలు:

*లాటరీ విధానం లో పాల్గొనదలచిన మద్యం దుకాణ లైసెన్సీ దారులు తేదీ 01.10.2026 రాత్రి 12.00 గంటల వరకు online, offline, Hybrid విధానం ద్వారా పాల్గొన వచ్చును. Online విధానం లో http://OC.hpfcproject.com ద్వారా web site ద్వారా పాల్గొనవచ్చును.

2.(21) సంవత్సరంలు ఉన్నవారు మాత్రమే మద్యం షాపులు వేసుకొనుటకు అర్హులు.

3) అప్లికేషన్ ఫీజు Rs.3,00,000/- నాన్ రిఫండ్ కింద గవర్నమెంట్ వారు నిర్ణయంచినారు.

4)రెన్యూవల్ కానీ (18) షాప్ లు వరుసగా Ongole Muncipal Corporation పరిధి లో (10) షాప్ లు PKM/01, 02, 03, 05, 06, 10, 11, 14,16, 19, కొతపట్నం మండల పరిధి లో (04) షాప్ లు NG పాడు మండల పరిధిలో (3) షాప్ లు21, 22, 24, 25, 28, 29, 30, మరియు టంగుటూరు మండల పరిధిలో ఒక్క షాప్ 33. కలవు.


*ప్రతి మద్యం దుకాణమునకు పర్మిట్ రూము తప్పనిసరి అని మరియు పర్మిట్ రూమ్ లైసెన్స్ ఫీజును సంవత్సరంలో 3 వాయిదాలలో చెల్లించవచ్చునని తెలిపారు.


* ఈ అప్లికేషన్లను తేదీ 05.10.2026 న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయించడం జరుగుతుందని ఈ ప్రకటనలో తెలిపినారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్