సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెనాలి - గుంటూరు మార్గంలో తెగిపడిన రైల్వే విద్యుత్ వైర్లు

4 రోజుల క్రితం

తెనాలి - గుంటూరు మార్గంలో 
తెగిపడిన రైల్వే విద్యుత్ వైర్లు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెనాలి: తెనాలి-గుంటూరు మార్గంలో బుధవారం రైలువిద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. ఉదయం ఎనిమిది గంటల సమయంలో గుంటూరు నుంచి రేపల్లె వెళుతున్న రేపల్లె ప్యాసింజర్‌ ‌రైలు తెనాలి అవుటర్లోకి చేరుకుంది. ఆ సమయంలో విద్యుత్ నార్త్ క్యాబిన్ సమీపంలో ఎలక్ట్రిక్ రాడ్ విరిగి రైలుపై పడడంతోపాటు వైర్లు కూడా తెగిపోయాయి. దీంతో పెద్ద శబ్దంతో రైలు నిలిచిపోయింది. ఒకవైపు వర్షం మరోవైపు విద్యుత్ వైర్లు తెగిపడడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి అపాయం లేకపోవడంతో అధికారులతో సహా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటికి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రయాణికులంతా దిగి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని వెళ్లిపోయారు. ఈ ప్రమాదం నేపథ్యంలో చెన్నయ్‌, విజయవాడ మెయిన్ లైన్లోనూ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మరమ్మతులకు ఉపక్రమించారు. గుంటూరు, విజయవాడ నుంచి పవర్ కార్లను తెప్పించారు. గుంటూరు, విజయవాడ డివిజన్ల రైల్వే ఉన్నతాధికారులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. దాదాపు రెండున్నర గంటల అనంతరం మరమ్మతులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

​తెనాలి రైల్వేస్టేషన్‌‌లో డిఆర్ఎం తనిఖీలు

తెనాలి రైల్వేస్టేషన్‌‌ను విజయవాడ రైల్వే డిఆర్ఎం మోహిత్ సోనాకియా బుధవారం సందర్శించారు. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వెయిటింగ్ హాల్స్, ప్లాట్ ఫారాలు, మరుగుదొడ్లు, బుకింగ్ కౌంటర్స్ తదితర పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ప్రయాణికులు, రైల్వే సిబ్బందితో మాట్లాడి స్టేషన్లో ఎదురవుతున్న సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్