మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Rains - తెలుగు రాష్ట్రాల్లో వానలు ..

12 ఆగస్టు, 2026

Rains - Rains in the Telugu states
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 04:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. కానీ ఇది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులకు కాస్త దూరంగా, బెంగాల్ సమీపంలో కేంద్రీకృతమై ఉండి, కోల్‌కతా మీదుగా తీరం దాటబోతోంది. దీనివల్ల అక్కడ ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ అల్పపీడనం వల్ల ఏర్పడిన ఉపరితల వాయు చక్రవాత తుపాను దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, దక్షిణ భారతదేశం వైపుగా చొచ్చుకొచ్చింది. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, కుత్బుల్లాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌,లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌, బంజారాహిల్స్‌, మణికొండ, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ మందగించింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్