శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసుల తోపులాట, ఒత్తిళ్ల వల్లే రాజశేఖర్ మృతి

13 గంటల క్రితం

పోలీసుల తోపులాట, ఒత్తిళ్ల వల్లే రాజశేఖర్ మృతి
- వాస్తవాలను నిగ్గు తేల్చాలి : సజ్జల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 08:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వాస్తవాలను నిగ్గు తేల్చాలి : సజ్జల

ప్రజాశక్తి–ఒంగోలు సిటీ : డిఎస్‌‌సి నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ ఈ నెల 22న విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో జరిగిన తోపులాట, తొక్కిసలాటలో వైసిపి ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ పలుమార్లు కిందపడిపోయారని, ఆ సంఘటన అనంతరం ఆయనపై అక్రమ కేసులు బనాయించడం, పోలీసుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడం వల్లే ఆయన తీవ్ర మానసిక ఆందోళనకు, అస్వస్థతకు గురయ్యారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ పరిణామాలే ఆయన మరణానికి దారితీశాయని పేర్కొంటూ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, వాస్తవాలను నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. ఒంగోలులోని క్లోపేటలో శుక్రవారం రాజశేఖర్‌ భౌతికకాయానికి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో సజ్జల మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేసే ధోరణి ప్రమాదకరమన్నారు. అధికారం ఉందని పోలీసు వ్యవస్థను కిరాయి సైన్యంలా వాడుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ తరహా దాడులు ప్రభుత్వ హత్యల కిందకే వస్తాయని ఆరోపించారు. రాజశేఖర్‌ మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్