శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లేబర్ కోడ్స్ రద్దు, కార్మిక చట్టాలు అమలు కోరుతూ ర్యాలీ

20 నవంబర్, 2026

లేబర్ కోడ్స్ రద్దు, కార్మిక చట్టాలు అమలు కోరుతూ ర్యాలీ
- డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ : సిఐటియు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 09:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ : సిఐటియు

ప్రజాశక్తి - నెల్లూరు : కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ రద్దు చేసి, కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నెల్లూరు నగర కమిటీ, కొట్టు ముఠా వర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట ప్రాంతం నుంచి పప్పుల వీధి, వాటర్ ట్యాంక్ ప్రాంతం వరకు ఈ ర్యాలీ సాగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికీ కనీస వేతనం నెలకు రూ.42 వేలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు, హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్మికుల ప్రజాస్వామిక హక్కులకు ఆటంకాలు కలిగించే చర్యలను నిలిపివేయాలని, ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూమి, అడవి, నీటిపై ప్రజలకు ఉన్న హక్కులు క్రమంగా హరించుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న కార్మిక పోరాట కార్యక్రమంలో జిల్లా కార్మిక వర్గం పెద్దఎత్తున పాల్గొనాలని సిఐటియు నాయకులు కోరారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతనాల పెంపుదల, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల అమలు లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్