బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాప్తాడు ఘటన నిందితుడికి కాలు తొలగింపు..

1 రోజు క్రితం

Raptadu incident Leg of the deranged man Hemanth amputated
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 09:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడు హేమంత్‌‌కు వైద్యులు కాలు తొలగించారు. పరారయ్యేందుకు ప్రయత్నించి పోలీసుల కాల్పుల్లో గాయపడిన అతడికి అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సంగతి విదితమే. కాలికి రక్తప్రసరణ పూర్తిగా లేకపోవడంతో మంగళవారం అతని కుడికాలును శస్ర్తచికిత్స చేసి తొలగించారు. అవసరమైతే రెండో ఎడమ కాలు కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుందని వైద్యులు తెలిపారు. మరోవైపు ​ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బెంగళూరు మణిపాల్‌ ‌వైద్యులు ప్రకటనలో తెలిపారు. బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతోందని తెలియజేశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సత్యకుమార్‌ మాట్లాడారు. పూర్తి స్థాయి వైద్య చికిత్సలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్