బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకోలుకుంటున్న రాప్తాడు విద్యార్థిని

1 గంట క్రితం

కోలుకుంటున్న రాప్తాడు విద్యార్థిని 
- కేక్‌ కట్‌ చేయించిన ఫొటోను విడుదల చేసిన వైద్యులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 07:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కేక్‌ కట్‌ చేయించిన ఫొటోను విడుదల చేసిన వైద్యులు

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హేమంత్‌ అనే దుర్మార్గుడి చేతిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్యం క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో డాక్టర్లు ఆమె చేత కేక్‌ ‌కట్‌ ‌చేయించిన ఫొటోను బుధవారం మీడియాకు విడుదల చేశారు. ఈ ఫొటోను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ‌ట్విట్‌ ‌చేస్తూ ‘చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఎంతో పెద్ద మార్పును తీసుకొస్తాయి. ఆ చిన్నారిలో ఉత్సాహాన్ని నింపడానికి, ఆమె గదిలోనే చక్కటి కేక్ కటింగ్, సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పిడియాట్రిక్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ చిన్నారికి మనోధైర్యం చేకూరాలని, త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!’ అని ఆ ట్విట్‌‌ చేశారు. విద్యార్థిని ఆరోగ్యం కుదుట పడుతుండడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్