మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమరావతి ఒఆర్‌ఆర్‌ టెండర్లపై స్టేకు నిరాకరణ

1 గంట క్రితం

amaravati.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 11:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఒఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్పును సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)లో టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలన్న పిటిషనర్‌ మధ్యంతర అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అలైన్‌మెంట్‌ నిర్ణయంలో నిబంధనలు పాటించలేదని, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌), మంత్రి మండలి ఆమోదం లేకుండానే టెండర్లు పిలిచారని పిటిషనర్‌ వాదించగా, అలైన్‌మెంట్‌ నిర్ణయం సాంకేతిక నిపుణుల పరిధిలోని అంశమని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్‌ లీసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన డివిజన్ బెంచ్ రాతపూర్వక వాదనలను సమర్పించేందుకు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరుకు చెందిన రైతు కనిగంటి ఆంజనేయ ప్రసాద్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ పిల్‌ దాఖలు చేశారు. అమరావతి ఒఆర్‌ఆర్‌లో విజయవాడ నార్త్‌ ఈస్ట్‌, సౌత్‌ ఈస్ట్‌ అలైన్‌మెంట్లను మార్చడాన్ని ఆయన సవాల్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్