సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండు డీఏ లు విడుదల

11 సెప్టెంబర్, 2026

employee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 11:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం

- 2024 జూన్, 2025 జనవరి నుంచి అమలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఉద్యోగులు, పింఛనుదారులకు కొంతవరకు ఉపశమనం కలిగింది. పాత కరవుభత్యం బకాయిల్లో రెండింటికి విడుదల చేస్తూ శుక్రవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల సెప్టెంబర్‌ నాటి జీతం, పింఛనుతో నగదు రూపంలో కొంత మొత్తం చెల్లించాలని నిర్ణయించారు. అలాగే మొత్తం బకాయిల్లో పది శాతాన్ని వచ్చే జనవరిలో, మిగిలిన 90 శాతాన్ని మూడు విడతల్లో చెల్లించాలని నిర్ణయించారు. ఇందులో ఒక డీఏ 1.82 శాతం ఇంకో బకాయి 2.73 శాతం గా ఇస్తున్నట్టు ప్రకటించారు. 2.73 శాతాన్ని 2024 జూన్ నుంచి ,1.82 శాతాన్ని జనవరి 2025 నుంచి అమలు చేయనున్నారు.

అందరు ఉద్యోగులు, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌ సంస్థలు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పెన్షన్‌ పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌-కమ్‌-పెన్షన్‌, గ్రాట్యుటీ రూల్స్‌, 1961, ఆంధ్రప్రదేశ్‌ లిబరలైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌, 1961 కింద పెన్షన్‌ పొందుతున్న ఎయిడెడ్‌ విద్యాసంస్థల బోధన, బోధనేతర సిబ్బంది కూడా ఈ పరిధిలోకి వస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్