శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పింఛను దరఖాస్తులో నిబంధనల సడలింపు

11 సెప్టెంబర్, 2026

savitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 11:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి సవిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలు బ్యాంకు స్టేట్ మెంట్ అందజేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు తీసుకున్న వివరాలు అందజేస్తే సరిపోతుందని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి వృద్ధ్యాప్యం, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత సహా అన్ని రకాల పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేతన్న భరోసా పెన్షన్ కు దరఖాస్తు చేస్తుకుంటున్న నేతన్నలకు బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధన తీవ్ర ప్రతిబంధకంగా మారిందన్నారు. మాస్టర్ వీవర్ దగ్గర పనిచేసే చేనేతలకు వ్యక్తిగతంగానే వేతనాలు చెల్లిస్తూ వస్తుంటారు. అటువంటి సమయంలో బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్ నిబంధన పెట్టడంతో చేనేతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇదే విషయమై పలువురు నేతన్నలు, చేనేత సంఘాల ప్రతినిధులు మంత్రి సవిత దృష్టికి సమస్యను తీసుకురావడంతో తక్షణమే ఆమె స్పందించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి చేనేతల సమస్యను తీసుకువెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బ్యాంక్‌ ‌స్టేట్మెంట్‌ ఇవ్వాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ నేతన్న భరోసా పెన్షన్లు అందజేస్తామని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఆయా జిల్లాల చేనేత, జౌళి శాఖాధికారులు బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్లు లేకున్నా దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 85 వేల మందికిపైగా నేతన్నలకు నేతన్న భరోసా పెన్షన్ పథకం కింద రూ.4 వేలు చొప్పున అందజేస్తున్నామన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్