- జగన్ ఓటుకు బ్రేక్
ప్రజాశక్తి పులివెందుల టౌన్ : మున్సిపాలిటీ ఎన్నికలలో సందర్భంగా జరిగిన పరిణామాలు దృష్ట్యా నాలుగు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్ ప్రక్రియ 8 గంటల కు ప్రారంభమైంది. ఓటు వేయడానికి ఓటర్లు ఓటు హక్కును నిర్వహించుకుంటున్నారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇందులో భాగంగా బయటి వ్యక్తులు ఎవరు రాకుండా తనిఖీలు చేస్తూ పోలింగ్ కేంద్రాలకి ఓటర్లను పంపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కంచెను ఏర్పాటు చేశారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదంటూ వైయస్ జగన్ ఆదివారం ఆందోళన వ్యక్తం చేసి వ్యక్తం చేసి, అన్ని పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహిస్తేనే ఓటు వేస్తానని ప్రకటించారు, కానీ పెద్దరంగాపురం-1, ఉల్లిమెల్ల-3, రోటరీపురం-7, జెండామాన్ వీధిలోని 8వ వార్డులో మాత్రమే రీ-పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన 15వ వార్డులో రీ పోలింగ్ లేకపోవడంతో జగన్ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది.







కామెంట్‌లు (0)