సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైఫిల్ షూటింగ్ సంఘాలపై సమగ్ర విచారణ చేపట్టాలని నారా లోకేష్‌కు విజ్ఞప్తి

1 గంట క్రితం

anantapuram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 02:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి

ప్రజాశక్తి - అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లోని రైఫిల్ షూటింగ్ సంఘాల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరుతూ అనంతపురానికి చెందిన జంపాల శ్రీకాంత్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. రైఫిల్ షూటింగ్ సెక్రటరీ డి. రాజ్‌కుమార్, అధ్యక్షుడు టి. సలలిత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రెండు రైఫిల్ షూటింగ్ సంఘాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. నకిలీ మ్యాచ్‌లు నిర్వహించడం, నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయడం, క్రీడాకారులు, వారి తల్లిదండ్రుల నుంచి ఎంట్రీ ఫీజుల పేరుతో భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా సుమారు రూ.12 కోట్ల నిధులు సరైన ఆడిట్ నివేదికలు, పారదర్శకత లేకుండా ఇతర ఖాతాలకు మళ్లించారన్న ఆరోపణలపైనా విచారణ జరపాలని కోరారు. ఈ నిధులను సక్రమంగా వినియోగించి ఉంటే షూటింగ్ రేంజ్‌ల అభివృద్ధి, మెరుగైన క్రీడా సదుపాయాల కల్పన, షూటర్లకు అవసరమైన సహకారం అందించేందుకు ఉపయోగపడేవని పేర్కొన్నారు.

కొంతమంది క్రీడాకారులు చెల్లుబాటు లేదా గుర్తింపు విషయంలో సమస్యలు ఉన్నట్లు ఆరోపణలు ఎదురవుతున్న సర్టిఫికెట్ల కారణంగా నీట్ అర్హత, ఉద్యోగ అవకాశాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 950 మందికి పైగా షూటర్లు, వారి కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని, జరిపించి, అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ కోరారు. క్రీడాకారుల విద్య, ఉపాధి అవకాశాలు, భవిష్యత్ క్రీడా జీవితంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్