సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తహసిల్దార్ కుర్చీలో అసిస్టెంట్ కలెక్టర్!

58 నిమిషాల క్రితం

east godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 04:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

క్షేత్రస్థాయి పాలనపై ప్రత్యక్ష అవగాహన

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : అసిస్టెంట్ కలెక్టర్ వంటి ఉన్నత స్థాయి అధికారిగా భవిష్యత్తులో బాధ్యతలు చేపట్టనున్న క్షితిజ్ ఆదిత్య శర్మ ప్రస్తుతం తహసిల్దార్‌ గా ఉండ్రాజవరం తహసిల్దార్ కార్యాలయంలో తర్ఫీదు పొందుతున్నారు. ఉన్నతస్థాయి పరిపాలనా బాధ్యతలు చేపట్టే ముందు, క్షేత్రస్థాయిలో పరిపాలన తీరు, ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి ఎలా వస్తాయి, రెవెన్యూ వ్యవస్థలో క్షేత్రస్థాయి అధికారి ఎదుర్కొనే సవాళ్లు వంటి అంశాలను స్వయంగా తెలుసుకునేందుకు శిక్షణ పొందుతున్నట్లు ఆదిత్య శర్మ తెలిపారు. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో ఆయనను పలకరించిన ప్రజాశక్తితో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, న్యాయశాఖ, గ్రామసభల నిర్వహణ, సెక్రటేరియట్ తదితర అంశాలలో శిక్షణ పొందిన తాను తహసిల్దార్ గా సుమారు నెలరోజుల పాటు శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. శిక్షణలో భాగంగా రెవెన్యూ పరిపాలన, భూ సంబంధిత అంశాలు, ధ్రువపత్రాల జారీ, ప్రజల నుంచి వచ్చే వినతులు తదితర అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన పొందనున్నట్లు తెలిపారు. కేవలం కార్యాలయాల్లో ఫైళ్లను పరిశీలించడం కాకుండా, క్షేత్రస్థాయిలో అధికారుల విధానం, ప్రజలతో వారి అనుసంధానం, సమస్యల పరిష్కారంలో ఎదురయ్యే పరిస్థితులను తెలుసుకుంటున్నానని అన్నారు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన తాను తొలుత ఐఆర్ఎస్ కు ఎంపికయ్యానన్నారు. ఒక సంవత్సరం అనంతరం, సెలవు పెట్టి, 2025 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణ పొంది, ఎంపికైనట్లు తెలిపారు. సాధారణంగా ఉన్నతాధికారులుగా బాధ్యతలు చేపట్టే ఉద్యోగులు తీసుకునే నిర్ణయాలకు క్షేత్రస్థాయి పరిస్థితులే పునాది అని అన్నారు. ఒక అధికారిగా సమస్యలను కింది స్థాయి నుంచి అర్థం చేసుకోవాలన్నట్లుగా ఒక యువ ఐఏఎస్ అధికారి తర్ఫీదు పొందడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పరిపాలనా నిర్ణయాల్లో ఈ క్షేత్రస్థాయి అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్