సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేతాజీ స్కూల్ విద్యార్థిని శాస్త్రీయ నృత్యంలో ప్రతిభ

1 గంట క్రితం

alamuru-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 04:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్వహించిన తరుణి తరంగణి దసరా సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా శాస్త్రీయ నృత్య పోటీలలో మండలంలోని చెముడులంక, మడికిలలో ప్రముఖ విద్యాసంస్థలుగా సేవలు అందిస్తున్న నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని గుండుబోగుల దివ్యశ్రీ ఉత్తమ ప్రతిభ కనబరిచిందని కస్పాండెంట్ తుమ్మ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా నలుమూలల నుండి పాల్గొన్న ప్రతిభావంతులైన విద్యార్థులలో తన ప్రత్యేకతను చాటుకుని అద్భుతమైన ప్రతిభతో తృతీయ బహుమతిని కైవసం చేసుకుందన్నారు. దీంతో ఉమ్మడి జిల్లా స్థాయిలో పాఠశాల ఖ్యాతిని చాటిందన్నారు. ఆమె ప్రదర్శనకు న్యాయనిర్ణేతల నుండి విశేష ప్రశంసలు లభించాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు తమ పాఠశాల ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. విద్యతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అధిక ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. ఈ విజయం పాఠశాలకే గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే విద్యార్ధి దివ్యశ్రీ కి నేతాజీ స్కూల్ డైరెక్టర్ తుమ్మ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ లంకలపల్లి మణికంఠ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు, మార్గదర్శకులైన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తూ ఆమె భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్