శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గత ప్రభుత్వంలో రూ.12 వేల కోట్లు దారి మళ్లింపు

1 గంట క్రితం

asohk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 11:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టిడిపి మాజీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు నేరుగా కేటాయించిన రూ.12 వేల కోట్లను గత వైసిపి ప్రభుత్వం దారి మళ్లించిందని మాజీ ఎమ్మెల్సీ పి అశోక్‌ ‌బాబు ఆరోపించారు. ఈ మేరకు టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణాల్లో తమకు 94 శాతం విజయం దక్కినట్లే శనివారం వెలువడే జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి ఫలితాల్లోనూ గ్రామీణ ప్రజలు కూటమికి చారిత్రక విజయాన్ని అందించబోతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక తాము అరాచకం చేశామని ఎన్నికల సంఘానికి వైసిపి 74 ఫిర్యాదులు ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్వహించారని, జగన్ మాత్రం ప్రతి బూత్, ప్రతి మున్సిపాలిటీ, ఎంపిటిసి, జెడ్‌‌పిటిసిల్లో గొడవలు సృష్టించే సంస్కృతిని తీసుకొచ్చారని ఆరోపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్