ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో దీపం 2 పథకం అమలుకు రూ.163.34 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సామాజిక సంక్షేమ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం, 2026 ఆగస్టు నుంచి నవంబర్ వరకు దీపం 2 అమలుకు ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల నుంచి ఈ నిధులను విడుదల చేశారు. త్రైమాసిక వ్యయ పరిమితులకు సడలింపు ఇచ్చి ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో రూ.163.34 కోట్లు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన పీడీ ఖాతాకు జమ చేయనున్నారు.
దీపం పథకానికి రూ.163.34 కోట్లు
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)