ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​బ్యాంకులను ప్రైవేటీకరించొద్దు

1 గంట క్రితం

cpm flag image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 12:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిపిఎం పోలిట్‌‌బ్యూరో

​న్యూఢిల్లీ: ఐడిబిఐ బ్యాంక్‌లోని 60.72శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేసింది.

భారతీయ బ్యాంకుల్లో విదేశీ సంస్థలు 26శాతానికి మించి వాటా కలిగి ఉండరాదని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నా, వాటిని కేంద్రం ఉల్లంఘిస్తున్నదని విమర్శించింది. ఫెయిర్‌ఫాక్స్‌కు ఇప్పటికే క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో 40శాతం వాటా ఉందని తెలిపింది. వరుసగా ఐదేళ్ల పాటు భారీ నష్టాలు చవిచూసిన ఐడిబిఐ బ్యాంక్, ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎల్‌ఐసి 51శాతం వాటా కొనుగోలు చేసిన తర్వాత కోలుకొని లాభాలు ఆర్జిస్తోందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అలాంటి బ్యాంకును ఇప్పుడు విక్రయించడం సరికాదని అభిప్రాయపడింది. ఫెయిర్‌ఫాక్స్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఐడిబిఐ షేర్ల ధరను గతంలో ఉన్న విలువ కంటే తగ్గించారన్న అనుమానాలు ఉన్నాయని సిపిఎం తెలిపింది. పలు వివాదాల నేపథ్యంలో గతంలో ఫెయిర్‌ఫాక్స్‌కు, దాని ఆడిటర్లకు రూ.50 లక్షల జరిమానా విధించిన విషయాన్ని కూడా గుర్తుచేసింది. అంతేకాదు, లాభాల్లో నడుస్తున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినట్లు వార్తలు వస్తున్నాయని సిపిఎం పేర్కొంది.

ప్రైవేటీకరణ వల్ల సామాజిక రంగాలకు ఇచ్చే రుణాలు, చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని పొలిట్‌బ్యూరో హెచ్చరించింది. దేశంలో అసమానతలు పెరుగుతున్న ఈ తరుణంలో బ్యాంకింగ్ సేవలను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో, అందరికీ రుణ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులపై పెద్ద బాధ్యత ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల ఉపసంహరణ ప్రణాళికలను ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్