- తిరుమలలో రద్దీ సాధారణం
- శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు
ప్రజాశక్తి - తిరుమల : టిటిడి నిర్వహిస్తున్న ఎస్‌వి ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన హెచ్ఆర్ ఛాంబర్స్ ఔట్‌సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పార్వతి రూ.50 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శనివారం తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలో టిటిడి ఇఒ ముద్దాడ రవిచంద్రను కలిసి విరాళం డిడిని అందజేశారు.
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి యాత్రికుల రద్దీ స్థిరంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్ట్‌మెంట్లలో యాత్రికులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి ముందస్తు దర్శన టోకెన్లు లేని సామాన్య యాత్రికులకు శ్రీవారి సర్వదర్శనం పూర్తి కావడానికి సుమారు ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. కంపార్ట్ మెంట్‌లో వేచి ఉన్న యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి సిబ్బంది ఎప్పటికప్పుడు పాలు, తాగునీరు, అల్పాహారం అందిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.








కామెంట్‌లు (0)