ప్రజాశక్తి - బ్రహ్మంగారిమఠం: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి జోగయ్య ఏజెంట్ల నియామక వ్యవహారం రాజకీయ వివాదానికి దారితీసింది. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఏజెంట్ల ఫారాలపై ముందుగానే సంతకాలు చేసి, వారినే ఏజెంట్లుగా నియమించుకున్నారు. మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చునేందుకు వెళ్లగా, అప్పటికే ఏజెంట్లు నియమితులయ్యారని, తమకు అనుమతి లేదంటూ వారిని వెనక్కి పంపారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నియమించిన ఏజెంట్లు తమ పార్టీకి చెందిన వారు కాదని పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారుమండలం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతోందని నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఏజెంట్ల నియామక వ్యవహారంపై ఎన్నికల అధికారులు స్పందించి, నిబంధనల ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.
వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థికి అధికార పార్టీ ఏజెంట్లు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026, 08:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)