ప్రజాశక్తి - నకరికల్లు (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చాగల్లు విద్యుత్ లైన్‌మెన్ దావీదు నాయక్‌పై స్థానిక టిడిపి నాయకుడు, గ్రామ సర్ప్ంచ్ అభ్యర్థి మద్దుల వెంకటేశ్వర్లు (వెంకట్) అసభ్య పదజాలంతో దూషణలకు దిగారు. చాగల్లులో జరుగుతున్న విద్యుత్ ఆధునీకరణ పనులకు లైన్‌మెన్ దావీదు నాయక్ అక్కడ విద్యుత్ శాఖ తరఫున విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సర్పంచ్ అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న మద్దుల వెంకటేశ్వర్లు లైన్‌మెన్ దావీదు నాయక్‌కు ఫోన్ చేసి తీవ్రంగా దూషించారు. దావీదు నాయక్ తల్లిని అసభ్యకరంగా మాట్లాడటంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. తిట్ల పురాణం అంతా రికార్డు చేసిన దావీదు నాయక్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంఆర్‌పిఎస్ నాయకులు రంగ ప్రవేశం చేశారు. ఉద్యోగిని అసభ్యపదజాలంతో దూషించిన మద్దుల వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కోరారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి కావడంతో పోలీసులు తగిన చర్యలు తీసుకోకుండా తాత్సారం చేశారని ఎంఆర్‌పిఎస్ నాయకులు ఆరోపించారు. బాధితుని ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోడంపై ఎస్‌ఐ కె.సతీష్‌ను వివరణ కోరినా సమాధానం దాటవేశారు.
విద్యుత్ లైన్‌మెన్‌పై సర్పంచ్ అభ్యర్థి దూషణలు
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)