సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచంద్ర‌బాబు చేతిలో కీలుబొమ్మ‌లా ఎస్ఇసి

2 రోజుల క్రితం

ambati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : సిఎం చంద్రబాబు నాయుడు చేతిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలుబొమ్మగా మారిందని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులోని త‌న కార్యాల‌యంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వకుండా టిడిపి దుర్మార్గాల‌కు వంత‌పాడిన పోలీసుల‌ను ఇప్ప‌టికే గుర్తించామని, చ‌ట్టాల‌ను ఉల్లంఘించిన పోలీసుల‌పై న్యాయ‌పోరాటం చేస్తామని తెలిపారు. తమ స‌మ‌క్షంలోనే నామినేష‌న్ ప‌త్రాల చించివేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. టిడిపి నాయకులు, పోలీసులు, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పోలీసు అధికారులు ఎవ్వరూ ఖాతర్ చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం, అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకొని దౌర్జన్యం చేసిన ఘటనలను తాము అన్ని నమోదు చేస్తున్నామని తెలిపారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్